హరిహర వీరమల్లు ను కలవర పెడుతున్న మరోసమస్య !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ విడుదలకోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ ఆసినిమా విడుదల ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది. కరోనా వేవ్ లు ప్రారంభం కాకముందు ప్రారంభం అయిన ఈమూవీని పూర్తి చేయడం దర్శకుడు క్రిష్ కు అగ్ని పరీక్షగా మారింది అని అంటారు.
 
 పవన్ కెరియర్ లో ఇప్పటివరకు చేయని ఛారిత్రాత్మక పాత్ర ఈమూవీలో చేస్తూ ఉండటంతో ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మొగలాయ్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నేపధ్యంలో జరిగే ఈమూవీ కథలో పవన్ చాల డిఫరెంట్ గెటప్ తో కూడిన రాబిన్ హుడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈసినిమాను ఏదోవిధంగా పూర్తిచేయాలి అని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకావడంతో ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది.
 
 
దీనితో ఈమూవీ ఖచ్చితంగా ఈ సమ్మర్ రేస్ లో విడుదల అవుతుంది అన్న ఆశలు పవన్ అభిమానులకు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈమూవీ యూనిట్ వర్గాల నుండి వస్తున్న లీకులు చాల భిన్నంగా ఉండటంతో పవన్ అభిమానులు నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ విడుదల మరొకసారి వాయిదా పడి ఆగష్టు 15 స్వాతంత్రదినోత్సవం సందర్భంగా విడుదల అవుతుంది అంటున్నారు.
 
ఇలా మరొకసారి వాయిదా పడటం వెనుక ఒక కారణం ఉంది అన్నప్రచారం జరుగుతోంది. ఈమూవీ షూటింగ్ పార్ట్ పూర్తి అయినప్పటికీ ఈమూవీకి సంబంధించి అత్యంత కీలకమైన గ్రాఫిక్ వర్క్స్ పూర్తికావనీ అందువల్లనే ఈమూవీ విడుదల మరొకసారి వాయిదా పడింది అంటున్నారు. ముఖ్యంగా ఈమూవీ చారిత్రాత్మక నేపధ్యంగల మూవీ కావడంతో ఈ మూవీకి గ్రాఫిక్ వర్క్స్ చాల కీలకం అనీ అందువల్లనే ఈవిషయంలో ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ గ్రాఫిక్ వర్క్స్ తో ఈమూవీ విడుదల చేయాలి అన్న క్రిష్ ఆలోచనలు వల్ల ఈమూవీ విడుదల మరొకసారి వాయిదా పడింది అని అంటున్నారు..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: