'పుష్ప2' తర్వాత బన్నీ ప్రయాణం అటువైపేనా..?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'పుష్ప'సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక పార్ట్2 తో పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పుష్ప 2 తర్వాత కూడా అదే స్థాయిలో సినిమాలు చేయాలని బన్నీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బన్నీ ఓ యూనివర్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాని ప్రకారం బన్నీ రీసెంట్ మీటింగ్స్ చూస్తుంటే కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో బన్నీ చేరబోతున్నట్లు తెలుస్తోంది. 

లోకేష్ కనకరాజ్ గత ఏడాది కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేశారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సినిమా కమర్షియల్ గా భారీ హిట్ అందుకుంది. ఇక సినిమా తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్.. ఇలా వరుస సినిమాలను ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఎక్కడో దగ్గర అల్లు అర్జున్ కనిపిస్తాడని లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇటీవలే లోకేష్ కనకరాజ్ తో అల్లు అర్జున్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ బన్నీ కొత్త సినిమా కోసమే అని అంటున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం ఖైదీ 2 ప్రాజెక్ట్ ఉంటుంది.

వీటి తర్వాత బన్నీ తో లోకేష్ కనకరాజ్ సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. కాకపోతే అందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఆమధ్య కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని బన్నీ అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవలేదు. అందుకే ఇప్పుడు రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తో మీటింగ్ పెట్టాడంటే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ తోనే అని అంటున్నారు. ఇక ఇది కనక వర్కౌట్ అయితే బన్నీ కోలీవుడ్ జర్నీ కూడా స్టార్ట్ అయినట్లే. అయితే ఈ  ప్రాజెక్టు పై పూర్తి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈనెల చివర్లో మూవీ టీం బ్యాంకాక్ షూటింగ్ కి వెళ్ళబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: