శాకుంతలం ట్రైలర్ లో బన్నీ కూతురు.. సూపర్ ?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తీసిన మైథిలాజికల్ చిత్రం శాకుంతలం. ఈ అద్భుతమైన పౌరాణిక సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 17 వ తేదీన తీసుకురాబోతున్నారు.విజువల్ వండర్ గా రూపొందిన శాకుంతలం సినిమా తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. ఈ సినిమాలో సామ్ శాకుంతలగా కనిపించనుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ 'శాకుతలం' చిత్రాన్ని గుణ శేఖర్‌ భారీగా తెరకెక్కిస్తున్నారు. శకుంతల ఇంకా దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమ కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.తాజాగా ఈ ట్రైలర్ సోమవారం నాడు  విడుదల చేశారు మేకర్స్.ఇందులో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు ఇంకా మేనకగా మధుబాలతోపాటు.. సీనియర్ నటి గౌతమి కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.


ఇక ఇదే సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా కీలకపాత్రలో కనిపించనుంది. అయితే శాకుంతలం సినిమా ట్రైలర్ రాగానే అందరి కళ్లు అర్హ పైన పడ్డాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ అల్లరిగా చాలా క్యూట్ క్యూట్ గా కనిపించే అర్హ.. ఈ మైథిలాజికల్ సినిమాలో ఎలాంటి లుక్‏లో కనిపించనుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపించారు నెటిజన్స్. అర్హను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న బన్నీ అభిమానుల ముందుకు శాకుంతలం ట్రైలర్‏లో అర్హను చూపిస్తూ మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్.ఈ సినిమాలో అర్హ శకుంతల కుమారుడు భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన  ట్రైలర్ చివరలో చిన్ననాటి భరతుడిగా.. సింహంపై క్యూట్ గా కూర్చుని ఎంట్రీ ఇచ్చింది అర్హ. సింహం పై ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న అర్హను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అర్హ ఎంతో క్యూట్ గా ఉందంటూ.. ఆమెకు సంబంధించిన క్లిప్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: