బాలయ్య షో లో వీరసింహరెడ్డి చిత్ర బృందం తో స్పెషల్ ఎపిసోడ్.. ఎప్పుడంటే..!?

Anilkumar
తాజాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని  దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. దీంతోపాటు తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో సాలిడ్ బస్ ని కూడా క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది .అయితే ఈ ట్రైలర్ ఊపు తగ్గకముందే ఈ సినిమాలో నుండి మాస్ మొగుడు అనే మరొక సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. 

అయితే వీర సింహారెడ్డి సినిమాలోని మాస్ మొగుడు పాట ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. ఈ పాటతో ఈ సినిమా ప్రమోషన్ లో మరింత జోష్ పెరగనుంది అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా  క్రియేట్ చేయని పాజిటివ్ బజ్ ని ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి ఒక గిఫ్ట్ ఇవ్వనున్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న స్టాప్ అబుల్ సీజన్ 2 షోలో తాజాగా రానున్న ఒక ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్ర బృందం రానంది.అయితే ఈ ఎపిసోడ్ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని తాజాగా ఆహా టీం అఫీషియల్ గా ఒక పోస్ట్ ని విడుదల చేసింది.

పండక్కి బాలయ్య తరఫునుంచి ఒక మాస్ కానుక గాడ్ ఆఫ్ మాసస్ విత్ ది టీం ఆఫ్ ది మాస్సివ్ వీరసింహారెడ్డి అండ్ స్టాప్ సంక్రాంతి సెలబ్రేషన్స్ విత్ ఎన్ బి కే కమింగ్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రీమియర్ అవుతుంది.. ఈ షోలో ఎవరెవరు వస్తారు.. అన్న విషయంపై ఆహా టీం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో భాగంగానే ఈ పోస్ట్ చూసిన చాలా మంది వీరి అభిమానులు ఈ ఎపిసోడ్ లో హాని రోజ్ కూడా వస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇక విరసింహారెడ్డి సినిమాలోని మా బావ మనోభావాలు అనే పాటకి బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఇక ఈ పాట విడుదలైనప్పటినుండి ఈ మలయాళ హీరోయిన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: