ఆ విషయంలో హర్ట్ అవుతున్న పూజా హెగ్డే ఫ్యాన్స్..!

Divya
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి.. ఆమె అందచందాల గురించి.. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఈ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయినా సినిమాలో నటించిన ఈమెకు మరింత పాపులారిటీ లభించింది.. అందానికి తగ్గ అభినయం, అందుకు తగ్గట్టుగా హైట్ మంచి నటనా ప్రతిభ.. అన్నీ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆ తర్వాత ఈమె చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలినా.. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అల వైకుంఠపురంలో సినిమా వరకు ఈమె కెరియర్ బాగానే కొనసాగింది.
ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె గత ఏడాది వరుసగా మూడు సినిమాలలో నటించినా మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి.  దీంతో ఈమె పై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క మహేష్ బాబు సినిమా మాత్రమే మిగిలి ఉంది.  అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న #SSMB28 చిత్రంలో ఈమె నటించాల్సి ఉండగా కాలు బెనకడంతో సినిమా షూటింగ్లకు హాజరు కాలేకపోయింది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఈ సినిమా కోసమే ఎదురుచూస్తోంది.  కనీసం మరొక సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు నిజానికి ఈమె దగ్గరకు అవకాశాలు రాలేదా ? లేక వచ్చినా రిజెక్ట్ చేసిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  ప్రస్తుతం పూజా హెగ్డే నుంచి ఒక సినిమా కూడా రాకపోవడంతో ఆమె అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారు. మరి ఈ విషయంపై పూజా హెగ్డే ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: