బాలయ్య వీరసింహరెడ్డి బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంత వయసు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు బాలయ్య. అయితే తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన  వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతి కానుకగా తెరకెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక  ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన చాలామంది అతిధులలో రెడ్ డ్రెస్ వేసుకున్న హనీ రోజ్

 తన అందంతో అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. ఇక వీర సింహారెడ్డి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన ఈమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మొదట ఈమె 2005లో మలయాళం లో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దాని అనంతరం కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ 2012లో రిలీజ్ అయిన త్రివేంద్ర లాడ్జ్ అనే సినిమాతో బ్రేక్ ఇచ్చింది. కానీ అనంతరం మలయాళం లో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

 అయితే మొదట ఈమె తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ను అందుకోలేకపోయింది. చిన్నచిన్న పాత్రలే కాకుండా అలా మమ్మట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది హాని రోజ్. ఇక తాజాగా బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటలో డాన్స్ తో అదరగొట్టింది ఈమె. ఇక  తేడాది విడుదలైన మాన్స్టర్ సినిమాలో మంచు లక్ష్మితో కలిసి లిప్ లాక్ లో నటించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది ఈమె.ఆ సినిమా తోనే అందరిని ఆకట్టుకున్న ఈమె ఈ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: