లీక్ అయిన "వారసుడు" స్టోరీ.. !?

Anilkumar
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక ట్రైలర్ విడుదల అయిన అనంతరం ఈ ట్రైలర్ పై రకరకాల ట్రోల్స్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా రొటీన్ కదా అని ఈ సినిమా దర్శకుడు తీసిన బృందావనం సినిమా కథలాగే ఈ సినిమా కూడా ఉంటుంది అని అంటున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...

 ఈ సినిమా విజయ రాజేంద్రన్ అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అని.. ఈ సినిమాలో విజయ్ ఒక సాధారణమైన వ్యక్తి అని ఒక పెద్ద కుటుంబం విజయ్ ని దత్తత తీసుకొని పెంచుకుంటారు.కొంతకాలం తర్వాత ఆ కుటుంబం పెద్ద చనిపోతారు. ఆ సమయం వరకు విజయ్ ఎక్కడో ఉంటాడు. ఆ వ్యక్తి మరణించిన సమయంలో విజయ్ అక్కడికి వస్తాడు. విజయ్ వచ్చిన సమయంలో అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దాని అనంతరం విజయ్ బిజినెస్ లోకి రావాలి అని భావిస్తాడు విజయ్. ఈ క్రమంలోని విజయ్ కి తన అన్నలకి మధ్య గొడవలు వస్తాయి.

 ఇక ఆ గొడవలు అన్నిటిని విజయ్ ఎలా పరిష్కరిస్తాడు అన్న విషయం చుట్టే ఈ సినిమా మొత్తం ఉంటుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ విజయ్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు.ఇక విజయ్ కి అన్నల పాత్రలో శ్రీకాంత్ మరియు శ్యామ్ నడుస్తున్న సంగతి మన అందరికీ తెలుస్తుంది. జయసుధ ఈ సినిమాలో విజయ్ కి తల్లి పాత్రలో నటిస్తున్నారు. విజయ్ కి వ్యతిరేకంగా ఉన్న ఒక కంపెనీని ప్రకాష్ రాజ్ రన్ చేస్తాడు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ ఇప్పుడు వారసుడు సినిమా స్టోరీ లీక్ అయింది అంటూ అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ స్టోరీ నిజమా కాదా తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: