"వాల్తేరు వీరయ్య" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... క్యాథరిన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేల ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ ... బాబి సింహ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొంత కాలం క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. వాల్తేరు వీరయ్య ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో యూట్యూబ్ లో 11.77 మిలియన్ వ్యూస్ ను ... 471.8 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత నటించిన ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: