అమిగోస్ టీజర్ టాక్: కళ్యాణ్ రామ్ కి మరో హిట్ పక్కా?

Purushottham Vinay
నందమూరి వారి పెద్ద వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అమిగోస్. రీసెంట్ గా బింబిసార సినిమాతో కెరీర్ లోనే భారీ హిట్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. మంచి హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి తన నటనతో ఎంతగానో మెప్పించారు.ఈ మూవీ భారీ సక్సెస్ తర్వాత వరుస మూవీలను లైనప్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలోనే మరో డిఫరెంట్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఫలితాలతో సంబంధం లేకుండా మంచి వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పించటానికి కళ్యాణ్ రామ్ ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి కూడా తనదైన పంథాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'అమిగోస్'. డెబ్యూ డైరెక్టర్ రాజేంద్ రెడ్డితో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ వినగానే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. 


అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే ఓ స్పానిష్ పదం.తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ మూవీ పై చాలా భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ టీజర్ లో త్రిబుల్ రోల్ లో కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ చూపించిన వేరియేషన్స్ అయితే అసలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.నందమూరి కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ ఇంకా అలాగే పోస్టర్స్ కారణంగా ఈ మూవీపై చాలా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.కళ్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది.ఇక 'అమిగోస్' నిర్మాణం ఫైనల్ స్టేజ్‌కు కూడా చేరుకుంది. ఇంకా అలాగే దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతోనూ టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీని ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: