వార్నర్ తెలుగు సినిమాల్లో నటిస్తావా.. నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్?

praveen
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తాను ఎంత గొప్ప క్రికెటర్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. అయితే వార్నర్ క్రికెటర్ గా మాత్రమే కాదు సోషల్ మీడియా సూపర్ స్టార్ గా కూడా అందరికీ సుపరిచితుడు. ఇక అతనికి క్రికెట్తో పాటు ఇతర యాక్టివిటీలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో తెలుగు హీరోల పాటలపై డాన్సులు చేసి ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెన్సేషన్ సృష్టించాడు.

 లాక్ డౌన్ సమయంలో ఏకంగా తన ఎంటర్టైనింగ్ వీడియోలతో ప్రేక్షకులందరినీ అలరించాడు డేవిడ్ వార్నర్. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో రిల్స్ తో అభిమానులను ఆకట్టుకోవడంలో ముందు ఉంటాడు అని చెప్పాలి. ఇక తెలుగు హీరోలకు సంబంధించిన ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులోని ఫేమస్ పాటపై డ్యాన్సులు చేయడం వార్నర్ కు బాగా అలవాటు. ఇక అలాంటి సోషల్ మీడియా సూపర్ స్టార్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ప్రముఖ ఓటీపీ ఫ్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లిక్స్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.

 క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సినిమాల్లో నటించాలని మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించాలి అంటూ నెట్ ఫ్లిక్స్ వార్నర్ ని కోరింది అని చెప్పాలి. ఇక డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలలో నటించడానికి సరైన వేదిక ఇచ్చేది మేమే అని భావిస్తున్నాము అంటూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం. అయితే దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా నవ్వుతున్న ఏమోజీలను పోస్ట్ చేశాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్టులు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. వార్నర్ నిజంగా తెలుగు సినిమాల్లో నటిస్తే మాకు అంతకంటే ఇంకేం కావాలని తెలుగు అభిమానులు  కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: