తెలుగు సంస్కృతికి చిరునామాగా మారిన రాజమౌళి !

Seetha Sailaja
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన రాజమౌళి విలాసవంతమైన జీవితానికి ఆడంబరాలకు చాల దూరంగా ఉంటాడు. రెండు సూపర్ హిట్ సినిమాలు తీస్తే చాలు అత్యంత విలాసవంతమైన ఇళ్ళు కార్లు కొనుక్కునే కల్చర్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దానికి భిన్నంగా రాజమౌళి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ఇండియాలో జక్కన్న ఆశించిన స్థాయిలో కలక్షన్స్ రాకపోవడంతో ‘బాహుబలి 2’ రికార్డులను ఆమూవీ బ్రేక్ చేయలేకపోయింది.

అయితే ఈవిషయమై ఏమాత్రం నిరాశ పడకుండా రాజమౌళి ఈమూవీని విపరీతంగా హాలీవుడ్ లో ప్రమోట్ చేయడంతో ఇప్పుడు ఈమూవీకి ఏదో ఒక విభాగంలో ఆస్కార్ అవార్డు వస్తుంది అన్న అంచనాలు స్పష్టంగా వస్తున్నాయి. లేటెస్ట్ గా హాలీవుడ్ క్రిటిక్ ఛాయస్ అవార్డ్స్ లో రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డ్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి లభించిన విషయం తెలిసిందే.

ఈఅవార్డును అందుకోవడానికి అమెరికా వెళ్ళిన రాజమౌళి మన భారతీయ సంప్రదాయంతో పంచతో అక్కడకు వెళ్ళి అమెరికా మీడియాను విపరీతంగా ఆకర్షించాడు. అమెరికాలో ప్రస్తుతం విపరీతమైన చలి ఉన్నప్పటికీ దానిని లెక్కచేయకుండా భారతీయ సాంప్రదాయక దుస్తులలో ఆ ఫంక్షన్ లో సందడి చేసిన రాజమౌళి వైపే హాలీవుడ్ మీడియా దృష్టి విపరీతంగా పడటంతో ఆఫంక్షన్ లో రాజమౌళి వేసుకున్న డ్రస్ అమెరికాలోని మీడియాను విపరీతంగా ఆకర్షించింది.

ఇది ఇలా ఉంటే ఆఈవెంట్లో రాజమౌళి చేసిన ఉపన్యాసం కూడ చాల విభిన్నంగా ఉంది. తాను సినిమాను మాత్రమే దేవుడుగా చూస్తానని వ్యక్తిగతంగా పూజలు చేయనని తాను ఎంచుకున్న వృత్తిని దైవంగా చూసే అలవాటు తనకు ఉన్న కారణంగానే తనకు ఈగౌరవం లభించింది అని కామెంట్ చేసాడు. అంతేకాదు ‘మామూలుగా సినిమా యూనిట్‌ను తమ కుటుంబం అంటుంటారు. కానీ నావిషయంలో ఇది కాస్త భిన్నం. నా కుటుంబ సభ్యులే యూనిట్ సభ్యులు. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడానికి వాళ్లంతా కష్టపడుతుంటారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’ అంటూ రాజమౌళి చేసిన ఉపన్యాసంలోని మాటలు అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: