ధమాకా: ఇప్పటివరకు ఎన్ని కోట్ల లాభం అంటే..?

Divya
మాస్ హీరో రవితేజ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లో వచ్చిన ధమాకా చిత్రం విడుదలై మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమాని డిసెంబర్ 23వ తేదీన గత ఏడాది విడుదల చేయగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన పాటలు ట్రైలర్స్ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజున ఇచ్చే మంచి టాకు రావడంతో కేవలం ఐదు రోజులలోనే బ్రేక్ ఈవెంట్స్ కంప్లీట్ చేసింది. ఈ సినిమా రెండో వారం కూడా కలెక్షన్ల పరంగా బాగా వసూలు చేస్తోంది. ఇక 15 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-16.16 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-6.36 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-4.4 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.66 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.18 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.64 కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.60 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-87 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.33.51 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-3.21 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2.54 కోట్ల రూపాయలు.
12). వరల్డ్ వైస్ గా ప్రస్తుతం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.39.26 కోట్ల రూపాయలను రాబట్టింది.

ధమాకా సినిమా రూ.20.45 కోట రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.20.70 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. ఈ చిత్రం రెండు  వారాలు పూర్తయ్యేసరికి దాదాపుగా రూ.40 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది దీంతో బయ్యారులకు దాదాపుగా రూ.18 కోట్లకు పైగా లాభాన్ని అందించింది. ఇక ఈ సినిమాతో పోటీగా ఎన్నో సినిమాలు విడుదల అవ్వగా ఈ సినిమా భారీగా కలెక్షన్ చేయడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఇప్పటికే కూడా కలెక్షన్ల భరత్ బాగా రాణిస్తూ ఉండడంతో మరి రాబోయే రోజుల్లో ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. రవితేజ కెరియర్ లో ఇప్పటివరకు ఈ సినిమాని హైయెస్ట్ కలెక్షన్ అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: