అలాంటి క్యారెక్టర్ చేయనని ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న స్టార్ హీరోయిన్....!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీ కి మొన్నిమధ్యే పరిచయమై చేసింది రెండు సినిమాల్ ఐనా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న యువ స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన హీరోయిన్ శ్రీలీల. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చేసిన మూవీ పెళ్లిసందడి తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై అది హిట్ సొంతం చేసుకొని తర్వాత వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ తో 'ధమాకా ' మూవీ తో కమర్షియల్ హిట్ అందుకుంది. ఐతే ప్రెసెంట్ తాను రామ్ తో చేస్తుంది అలాగే వైష్ణవ్ తేజ్ తో కూడా చేస్తుంది అలాగే ఇండస్ట్రీ లో వస్తున్నా వార్తల్ని బట్టి ఆమె మహేష్ మరియు త్రివిక్రం కాంబో సినిమాలో కూడా చేస్తుందని తెలుస్తుంది.
ఐతే మహేష్ మూవీ లో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేస్తుందని ఇండస్ట్రీ లో వినబడుతున్నాయి. ఐతే ఆమె మాత్రం ఆ మూవీ నుండి సైలెంట్ గా తప్పుకుందని అని వార్తలు వినబడుతున్నాయి.ఐతే ధమాకా మూవీ హిట్ అవ్వడం తో ఆమె తన పథాట్ మార్చుకొని సెకండ్ హీరోయిన్ గా చేసేకంటే మహేష్ పక్కన మెయిన్ హీరోయిన్ ఐతే చేద్దాం అని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఆ మూవీ కి ఫస్ట్ ఒప్పుకున్నా తర్వాత ఆ సినిమా నుండి తప్పుకుంది అంట.
ఐతే మనందరికి తెల్సిన విషయం ఏంటంటే కచ్చితంగా త్రివిక్రంచేసే మూవీ లో హీరోయిన్ తో పాటుగా సైడ్ హీరోయిన్ ఉండాల్సిందే.ఐతే ఆలా చేసిన వాళ్లలో ఇప్పటికి ఏ హీరోయిన్ కి కూడా అంతగ కలిసి రాలేదు.అందుకే ఆమె ఆలా అనుకుందంట.ఐతే శ్రీ లీల కూడా అలాంటి ఉద్దేశంతోనే ఆ మూవీ నుంచి సైడ్ యిందని టాక్. ఐతే ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటుందాన్ని బట్టి ధమాకా సూపర్ హిట్ అవ్వగా మరోకా హిట్ పడితే మాత్రం శ్రీలీలని ఆపడం కష్టమని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: