మహేష్ 28వ మూవీ నుండి ఆ ముద్దుగుమ్మ తప్పుకుంది అనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదట..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  రూపొందుతున్న ఒక క్రేజీ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం అయింది. అలాగే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే త్రివిక్రమ్ ... మహేష్ కోసం రాసుకున్న కథ ప్రకారం ఈ సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను చిత్ర బృందం ఎంపిక చేసుకుంది. అలాగే రెండవ హీరోయిన్ గ శ్రీ లీల ను కూడా ఇప్పటికే మూవీ యూనిట్ ఎంపిక చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ మూవీ నుండి శ్రీ లీల తప్పుకుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ మూవీ నుండి శ్రీ లీల తప్పులేదు అని ... ఆ వార్తలు అన్నీ కేవలం అవాస్తవం అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇప్పటికే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు ... ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ప్రశంసలను అందుకోవడంతో తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: