ఆ మూవీలు ఎలాగో "వీర సింహారెడ్డి" కూడా అలాగే... బాలకృష్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా అఖండ మూవీ తో భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు.

శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... దునియా విజయ్ ... వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర కీలకమైన పాత్రలో నటించారు. తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ కి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న అనగా జనవరి 6 వ తేదీన ఈ సినిమా యూనిట్ భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ ... ఒక సమర సింహా రెడ్డి మూవీ ఎలాగో ... ఒక నరసింహ నాయుడు మూవీ ఎలాగో ... ఒక సింహ ... లెజెండ్ ... అఖండ మూవీ లు ఎలాగో అటువంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా వీర సింహా రెడ్డి అవుతుంది అని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: