24 గంటల్లో "వారిసు" మూవీకి వచ్చిన వ్యూస్ ... లైక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న దళపతి విజయ్ పోయిన సంవత్సరం బీస్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు  ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు  పూజా హెగ్డే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది  ఇలా బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ తో ఆకరుగా ప్రేక్షకులను పలకరించిన విజయ్ మరికొన్ని రోజుల్లో వారిసు అనే తమిళ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో రూపొందిన ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... తమన్ సంగీతం అందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

శ్రీకాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఈ నెల 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ తమిళ ట్రైలర్ కు 24 గంటల్లో యూట్యూబ్ లో 23.05 మిలియన్ వ్యూస్ ... 1.83 మిలియన్ లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ తమిళ్ వెర్షన్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: