ఏంటి హీరో అజిత్.. పైలెట్ కూడానా.. లైసెన్స్ కూడా ఉందట?

praveen
తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్బస్టర్లు సొంతం చేసుకుంటున్నాడు స్టార్ హీరో అజిత్. తన తెల్ల గడ్డంతోనే తమిళ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన అజిత్ ఇక అదేస్టైల్ ఫాలో అవుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో సంక్రాంతి బరిలోకి  దిగి మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అజిత్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

 ఆయన నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో కూడా డబ్ అయ్యి ఇక మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే అజిత్ కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ప్రతి విషయంలో ప్రేక్షకులకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. నేటి టెక్నాలజీ యుగంలో అందరూ ఫోన్ వాడటం కాదు కొంతమంది అయితే రెండు మూడు ఫోన్లను వెంటపెట్టుకుంటున్నారు. కానీ అజిత్ మాత్రం ఇప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఒక ఫోన్ కూడా వాడటం లేదు. మేనేజర్ సహాయంతోనే కుటుంబ సభ్యులకు అభిమానులకు కాంటాక్ట్ అవుతుంటాడు.

 అంతేకాదు ఇక అందరిలాగా నెరిసిన జుట్టుకు కలర్ వేయకుండా ఇక మేకప్ తో అందంగా కనిపించడానికి ప్రయత్నించకుండా ఎంతో సహచంగానే సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి శైలి ఆయనను అందరి హీరోల్లో కెల్లా ఎంతో ప్రత్యేకంగా నిలబెట్టింది అని చెప్పాలి.  అయితే సాధారణంగా ట్రావెలింగ్ ను అజిత్ అమితంగా ఇష్టపడుతుంటారు అన్న విషయం అందరికి తెలుసు. కాస్త ఖాలి సమయం దొరికిన కూడా బైక్ రైడింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అజిత్ కేవలం బైక్ రైడింగ్ చేయడమే కాదు పైలెట్ గా మారి విమానాలు కూడా నడుపుతూ ఉంటాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

 అజిత్ హీరో మాత్రమే కాదు పైలట్ కూడా అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోయింది. అంతేకాదండోయ్ అతనికి విమానాలు నడిపేందుకు అధికారికంగా లైసెన్స్ కూడా ఉందట. ఇక ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు అజిత్ పలు కారు రేసింగ్ లలో కూడా పాల్గొన్నాడు. కాగా మెకానిక్ ఉద్యోగంతో కెరియర్ ప్రారంభించిన అజిత్ ఇక ఇప్పుడు అంచలంచలుగా ఎదుగుతూ ఏకంగా స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నాడు. కాగా అజిత్ నటించిన  తునివు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: