పవన్ కళ్యాణ్ బద్రి సినిమా రీ రిలీజ్ డేట్ లాక్..!

Divya
గత ఏడాది నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు హీరోల పుట్టినరోజు సందర్భాలలో మాత్రమే సినిమాలను రీ రిలీజ్ చేయగా ఇప్పుడు ప్రత్యేక పర్వదినాలలో కూడా స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే మరీ ముఖ్యంగా నెలకొక పవన్ కళ్యాణ్ సినిమా అన్నట్టుగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ ఆయన క్రేజ్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోని జల్సా , ఖుషి సినిమాలను రీ రిలీస్ చేయగా ఇప్పుడు బద్రి సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

బద్రి సినిమాను  గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26వ తేదీన థియేటర్లలో రీ రిలీస్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు.  ఎలాగో ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత హాలిడే ఇవ్వబడుతుంది కాబట్టి ఆ సమయంలో థియేటర్లకు జనాలు ఎక్కువగా వెళ్తారన్న నేపథ్యంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జల్సా , ఖుషి సినిమాలు  కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే బద్రి కూడా సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూreee జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది . అంతేకాదు ఈ సినిమా ద్వారా పూరీజగన్నాథ్ మొదటిసారి తెలుగుతెరకు పరిచయమయ్యాడు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా తర్వాత తన తదుపరిచిత్రాలను తెరకెక్కించే అవకాశం ఉంది. ఒకవైపు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూనే మరొకవైపు ప్రజలకు దగ్గరయ్యే విధంగా రాజకీయాలలో కూడా వేగంగా పాదం కదుపుతున్నాడు.  మరి రెండింటిలో విజయం సాధిస్తారో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: