కళ్యాణం కమనీయం సినిమా పోటీ ఎదుర్కోగలదా..?

Divya
వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏక్ మినీ కథ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సంతోష్ శోభన్ తాజాగా నటిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం.. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా అనిల్ కుమార్ అల్లా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిన్న లాంచ్ చేసింది. ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
"నీ భోగమే భోగం రా.. ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామ.. ఇవే పనులా?  లేక ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? "  అంటూ హీరో క్యారెక్టర్జేషన్ గురించి చెబుతూ సాగే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలయ్యింది . పెళ్లయిన తర్వాత అంతా సవ్యంగా నడుస్తుందనుకున్న క్రమంలో హీరో శివకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు ఏమో కానీ..  శృతి  (హీరోయిన్) భర్తకు ఉద్యోగం ఉండాలని అంటుంది.  పెళ్లికి ముందు ఎప్పుడూ ఉద్యోగమే చేయని శివ పెళ్లి అయ్యాక శృతి కోసం ఉద్యోగంలో చేరితే ఏమైంది? అనేది సస్పెన్షన్ లో పెడుతూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
ఇకపోతే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను జనవరి 14వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్న హాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి శ్రావణ్ భరద్వాజ కంపోజిషన్ లో విడుదలైన ఓ మనసా, హో  ఎగిరే పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  ఇప్పుడు ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో కళ్యాణం కమనీయం చిత్రానికి థియేటర్ లు  తక్కువగా కేటాయించినట్లు తెలుస్తోంది.  ఒకవేళ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం పెద్ద సినిమాలైనా ఏదో ఒకటి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఆ థియేటర్లలో కళ్యాణం కమనీయం సినిమా ప్రదర్శించబడే అవకాశం ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పెద్ద సినిమాలకు పోటీగా దిగుతున్న ఈ సినిమా నెగ్గుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: