నటుడు నరేష్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన మూడవ భార్య రమ్య !

VAMSI
టాలీవుడ్ సూపర్ స్టార్ కృషాకు ముగ్గురు కొడుకులు అని తెలిసిందే. ఇటీవలే కృష్ణ , విజయనిర్మల, రమేష్ బాబు లు మరణించారు...దీనితో ఒకే సంవత్సరం కుటుంబంలోని కీలక వ్యక్తులు తమను వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం అంతా దుఃఖంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే కృష్ణ మరో కొడుకు నరేష్ గురించిన ఒక విషయం గత కొంతకాలంగా టాలీవుడ్ లో నానుతూ ఉంది. నరేష్ చేస్తున్న ఈ పని కారణంగా ఘట్టమనేని ఫ్యామిలీ ఒక రకంగా సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఈయనకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయిపోయిన విషయం అందరికీ తెలుసు. గత కొంతకాలంగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు.
కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం పెళ్లి చేసుకునే అంత వరకు వచ్చింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ చెప్పారు. అయితే ఇపుడు నరేష్ మూడవ భార్య రమ్య రంగంలోకి దగి భర్త పెర్సనల్ విషయాలను బయటపెట్టింది. నాతో విడాకులు తీసుకోకుండా ఎలా ఆమెను పెళ్లి చేసుకుంటాడో చూస్తానంటూ సవాలు విసిరింది. పైగా వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు జరిగిన విషయాలను మీడియాలో లీక్ చేసింది. రమ్యతో సంసారం చేస్తున్నపుడు నరేష్ కు బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉందట. కన్న కొడుకు ముందే బ్లూ ఫిలిమ్స్ చూసే వాడని అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఈ కారణంగా నా కొడుకు మానసికంగా చాలా బాధపడ్డాడని తెలిపింది.
ఇది మాత్రమే కాకుండా నాకు మా కార్ డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని చాలా ఇబ్బంది పెట్టేవాడిని తెలిపింది. ఇంకా చాలా మందితో అక్రమ సంబంధం ఉందని గొడవ గొడవ చేసి నరకం చూపించేవాడంటూ రమ్య ఓపెన్ అయింది. అయితే ఇంతకు ముందే నరేష్ రమ్యతో విడాకులు మరియు భరణం లాంటి విసయల్ను సెటిల్ చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రమ్య మాటలతో మళ్ళీ మ్యాటర్ మొదటికి వచ్చినట్లు ఉంది. మరి ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: