సుమ షో లో మెగాస్టార్.. ఎప్పుడంటే..!?

Anilkumar
ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలు ఎంతటి ఆదరణను పొందుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల కంటే బుల్లితెరపై షోలే ఎక్కువయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పోస్ట్ గా వ్యవహరించిన షోలు భారీ స్థాయిలో సక్సెస్ను అందుకున్నాయి. అయితే ఇప్పటికే హోస్ట్గా వ్యవహరించిన అలీతో సరదాగా మరియు మంచు లక్ష్మి చేసిన ఒక టాక్ షో మరియు రానా హోస్ట్గా వ్యవహరించిన నంబర్ వన్ యారి ఎంతటి ఆదరణను పొందాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అయితే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటుంది. అయితే ఇన్ని షోలు ఉన్నప్పటికీ తాజాగా బుల్లితెరపై మరో కొత్త షో ప్రారంభం కానుంది. అయితే ప్రముఖ యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన సుమా కనకాల హోస్ట్గా వ్యవహరిస్తున్న సుమ అడ్డ అని పేరుతో ఒక షోను ప్రారంభం చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ఒక ప్రోమో ని కూడా తాజాగా విడుదల చేశారు. అంతేకాదు ఈ షో కి సంబంధించి ఇప్పటికే పలువురో స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ షో కి గెస్ట్లుగా రానున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే సుమా హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో కి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. అయితే సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారు అన్న వార్త విన్న చాలామంది సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఏ గేమ్ షోలకి కూడా రాలేదు. దీంతో నిజంగానే సుమ షో కి మెగాస్టార్ చిరంజీవి వస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో చాలామంది నిజంగా మెగాస్టార్ చిరంజీవి వస్తే బాగుంటుంది అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: