సమంత మరోపొరపాటు చేస్తోందా ?

Seetha Sailaja
గతకొంతకాలంగా సమంత ఆరోగ్యం పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ ఆమె తన ‘మయోసైటిస్’ అనారోగ్యం నుండి కోలుకుంటున్నట్లు తెలియచేసే ఒక వ్యూహాత్మకమైన అడుగువేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది అని ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే ఆమె డబ్బింగ్ స్టూడియోలో తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ను డబ్బింగ్ చెపుతున్నట్లుగా ఆమె కూర్చుని ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
 ఇదే సందర్భంలో ఆమె భావయుక్తంగా చేసిన కొన్ని కామెంట్స్ కూడ వైరల్ గా మారాయి. ‘నా బాధను నష్టాన్ని నా అనారోగ్యాన్ని ఇలా అన్నింటికి పరిష్కారం చెప్పగల శక్తి ఒక కళకు మాత్రమే ఉంది’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ లో ఎంతో వేదాంతంతో పాటు ఆమెకు కళ పట్ల ముఖ్యంగా నటన పట్ల ఆమెకు ఉన్న విపరీతమైన మక్కువను తెలియచేస్తోంది.
 
 
‘శాకుంతలం’ సినిమాకు సంబంధించి ఆమె డబ్బింగ్ చెపుతున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోను చూసి కొందరు ఈవిషయంలో కూడ సమంత పొరపాటు చేస్తోందా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికికారణం సమంతకు తెలుగు మాట్లాడటం వచ్చినప్పటికీ ఆమె మాట్లాడే భాషలో ఎక్కడో అక్కడ తమిళయాస కనిపిస్తుంది. ఈమధ్యనే విడుదలైన ‘యశోద’ మూవీలో సమంత పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ అక్కడక్కడా తెలుగు ఉచ్చారణలో కొన్ని పొరపాట్లు కనిపించాయి అంటూ విమర్శకులు కామెంట్స్ చేసారు.
 
 
సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీలో డైలాగ్స్ సాధారణ సాంఘీక సినిమాలలో ఉండే విధంగా తేలికగా ఉండవు. చాల చోట్ల గ్రాంధిక భాష సమంత తన శకుంతల పాత్ర కోసం పలకవలసి ఉంటుంది. తెలుగు భాష పై పూర్తి పట్టులేకుండా సమంత తన సహజ సిద్ధమైన తమిళ వాసన తో ‘శాకుంతలం’ మూవీలోని డైలాగ్స్ చెపితే అంత రక్తికట్టదని అందువల్ల సమంత తన శకుంతల పాత్ర కోసం ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోకుండా సమంత ఆత్మగా పేరు గాంచిన చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది అంటూ అప్పుడే కొందరు సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: