వీర సింహారెడ్డి మూవీ ట్రైలర్ ఎప్పుడంటే..?

Divya
మాస్ యాక్షన్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డి. అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో తలపడనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు m ఇందులో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు సుమారుగా రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అంతేకాదు సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  కూడా ఈరోజు సాయంత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే  గతంలో ఒంగోలులోని  ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించాలని అనుకున్నప్పటికీ ఏపీ పోలీసులు నిరాకరించారు . ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు తరలివస్తారన్న నేపథ్యంలో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుంది.  కాబట్టి వేదిక మార్చుకోవాలని తెలియజేశారు.  ఈ క్రమంలోనే ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్ కి సమీపంలో ఉన్న అర్జున్ ఇన్ఫ్రా లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ప్లాన్ చేస్తున్నారు . ఎట్టకేలకు ఈరోజు అనగా జనవరి 6 సాయంత్రం అర్జున్ ఇన్ఫ్రా లో ప్రీ  రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపబోతున్నారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగానే సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లాయి.. మరొకవైపు గ్లింప్స్, పోస్టర్స్ యువతను మాస్ యాక్షన్స్ వైపు తీసుకెళ్తున్నాయి.  ఇలా ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ అంటే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికి అయితే ఈ ట్రైలర్ తో  బాలయ్య మరో సంచలనం సృష్టించబోతున్నాడు అని అయితే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: