మరోసారి ఆదర్శకుడికి చిరంజీవి ఛాన్స్ ఇవ్వనున్నాడా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరోగా నటించాడు.

మైత్రి మూవీ సంస్థ నిర్మించిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మిల్కీ బ్యూటీ తమన్న ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ... ప్రభుదేవా దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ.కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా జిందాబాద్ మూవీ కి ప్రభుదేవా దర్శకత్వం వహించగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: