తన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే అంటున్న ప్రగ్యా జైస్వాల్..!!

Divya
కొంతమంది హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కానీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విషయంలో మాత్రం కాస్త భిన్నంగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా చాలా స్లిమ్ గా మెయింటైన్ చేస్తూ ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ అందాల విందు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ బాడీ స్ట్రక్చర్ లో కూడా ఎక్కడ ఏవి ఎలా ఉండాలో అలాగే చక్కగా ఉండేలా తన శరీర ఫిట్నెస్ ని సమకూర్చుకుంటూ ఉంటుంది.

ఇక చిన్నతనం నుంచి ఫిట్నెస్తో ఉండడం తనకు చాలా ఇష్టమని అందుచేతనే తన తండ్రి దగ్గర పలు యోగాలు కూడా నేర్చుకున్నానని చిన్న వయసు నుంచే చిన్న చిన్న వ్యాయామాలు చేసే వారిని తెలియజేస్తోంది. ఇప్పటికి తాను ఎన్నో బరువులెత్తుతూ ,పుష్యప్స్, స్కాట్ చేస్తానని తెలియజేస్తోంది. వారంలో కచ్చితంగా ఐదు రోజులపాటు రోజు ఒక గంట వ్యాయామం కూడా తప్పకుండా చేస్తానని తెలియజేస్తోంది. అంతేకాకుండా డాన్స్ ద్వారా కూడా ఫిట్నెస్ను సాధిస్తానని తెలియజేస్తోంది. తన దృష్టిలో నృత్యాన్ని మించిన కసరత్తు లేదని రోజు విడిచి రోజు డాన్స్ చేయడం స్కూలు వయసు నుంచి అలవాటైందని తెలియజేస్తోంది.

సినిమాలోకి వచ్చాక నాట్యానికి చాలా బానిస అయ్యానని కూడా తెలియజేస్తోంది .అంతేకాకుండా బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడనని ఇంటిలో భోజనానికి ఎక్కువ ఇష్టపడతానని తెలియజేస్తోంది. కోవిడ్ సమయంలో కాస్త బరువు పెరిగానని మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా తిండి విషయంలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తోంది. ఇక చర్మ సంరక్షణ విషయంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటానని.. ప్రతిరోజు కూడా క్లీనింగ్ అంటే ఏదైనా లిక్విడ్ తో క్లీన్ చేస్తూ ఉంటానని తెలియజేస్తోంది. అలా కొద్దిసేపు ఫేస్ ని మాయిశ్చరైజేషన్ చేసుకుంటానని తెలియజేస్తుంది ప్రగ్యా జైస్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: