సంక్రాంతి మూవీల విడుదల తేదీలు వచ్చేసాయి..!

Pulgam Srinivas
ప్రతిసారి సంక్రాంతి పండుగ లాగానే ఈ సారి సంక్రాంతి పండుగకు కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కావడానికి రెడీగా ఉండగా ... మరొక చిన్న సినిమా కూడా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది. ఇది ఇలా ఉంటే ఈసారి సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోయే సినిమాల విడుదల తేదీలు అన్నీ కూడా వచ్చేశాయి. మరి ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.
తునివు : కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 11 వ తేదీన తమిళ్ ... తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని తెగింపు పేరుతో విడుదల చేయనున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించాడు.
వారిసు : తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. తెలుగులో ఈ మూవీ ని వారసుడు టైటిల్ తో విడుదల చేయనున్నారు.
వీర సింహా రెడ్డి : బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రి సంస్థ ఈ మూవీ ని నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
వాల్తేరు వీరయ్య : చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూ వీని జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.
కళ్యాణం కమనీయం : సంతోష్ శోభన్ హీరోగా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గ తెరకెక్కిన ఈ మూవీ ని అనిల్ కుమార్ అల్లా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: