అవతార్ 2, ధమాకా సినిమాలకు కలిసొచ్చినట్టేనా..?

Divya

డిసెంబర్ రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా 180 కి పైగా భాషలలో విడుదలైన  అవతార్ : ది వే ఆఫ్ వాటర్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు.  ఇప్పటికే ఇండియాలో అత్యధిక కలెక్షన్ సాధించిన నంబర్ వన్ హాలీవుడ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్లలో రన్ అవుతోంది అంటే.. బలమైన సినిమాలు ఏవి విడుదల కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ బాగా పెరిగిపోయింది . ఈ క్రమంలోనే సినిమాను థియేటర్ నుంచి తొలగించడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరొకవైపు మాస్ మహారాజా రవితేజ చివరిగా 2021లో క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత ఈయన నటించిన ఖిలాడి,  రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలు ఘోరపరాజయాన్ని అందించాయి.  ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని పొందాలన్న ఆలోచనతో రవితేజ ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఇందులో మళ్లీ పాత రవితేజను చూస్తున్నాము అంటూ అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేశారు. క్రాక్ సినిమా కంటే భారీ కలెక్షన్స్ వసూలు చేసి పక్కా కమర్షియల్ హిట్ అందించింది ధమాకా చిత్రం . ఇందులో శ్రీ లీలా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఒకవైపు అవతార్ 2,  మరొకవైపు ధమాక చిత్రాలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.  ఎందుకంటే సంక్రాంతి పండుగకు సినిమాల హవా జనవరి 11 నుంచి మొదలవబోతోంది. కాబట్టి అప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలేవి కూడా వారాంతంలో విడుదలయ్యే అవకాశాలు లేవు.  అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కావడం లేదు. దీంతో ఈ రెండు సినిమాలు కూడా మరికొన్ని రోజులు థియేటర్లలో ప్రదర్శించబడతాయని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రెండు చిత్రాలు  కూడా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: