గుడ్ న్యూస్.. వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్.. ఎప్పుడంటే..?

Divya
టాలీవుడ్ లో సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో పాటు ,తమిళ సినిమా వారసుడు.. అజిత్ తునీవు వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇప్పటివరకు వారసుడు సినిమా ట్రైలర్ మాత్రమే విడుదలయ్యింది, అలాగే అజిత్ నటించిన తునవు సినిమా ట్రైలర్ కూడా విడుదలయ్యింది. వీటికి కూడా మంచిగా రెస్పాన్స్ లభించాయి. ఇక బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలకు కూడా పలు పాటలు విడుదలై బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి విడుదలైన పాటలు కూడా ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రవితేజ కి సంబంధించి మోషన్ టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నది. ముఖ్యంగా రవితేజ ఇందులో నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ చేశారని వార్తలు కూడా వినిపించాయి. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అభిమానులు ఈ సినిమా పై మరింత నమ్మకాన్ని పెట్టుకున్నారు.
అయితే ఈ రోజున తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఈరోజున విడుదల కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రాలలో ఏవి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటాయో తెలియాల్సి ఉంది. దాదాపుగా చిరంజీవి, బాలయ్య పదేళ్ల తర్వాత పోటీపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు చిరంజీవి , బాలయ్య సినిమాలకు క్రేజ్ బాగానే ఉంది.. మరి సినిమాలు విడుదలైన తర్వాత ఏ సినిమాకి ప్రేక్షకులు ప్రమాదం పడతారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: