"ఖుషి" రీ రిలీజ్ లో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో ఖుషి మూవీ ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు ఎస్ జే సూర్య దర్శకత్వం వహించగా ... అందాల ముద్దుగుమ్మ భూమికా చావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించాడు.

అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను పోయిన సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీన మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ కి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. 4  రోజుల్లో భాగంగా ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.


ఖుషి సినిమా రీ రిలీస్ లో భాగంగా నైజాం ఏరియాలో 2.54 కోట్ల కలెక్షన్ లను సాధించింది. సీడెడ్ లో 75 లక్షలు . ఆంధ్రా లో 2.60 కోట్ల కలక్షన్ లను సాధించింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4 రోజుల్లో 5.89 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 61 లక్షలు .  ఓవర్సీస్ లో 28 లక్షలు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 4 రోజుల్లో 6.78 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఖుషి సినిమా రీ రిలీస్ లో భాగంగా కూడా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: