వారసుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్..!

Divya
విజయ్ దళపతి హీరోగా నటించిన వారసుడు మూవీ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ సంక్రాంతికి టాలీవుడ్ పెద్ద హీరోలతో పోటీ పడబోతున్నాడు. అతడు నటించిన బైలింగ్వల్ చిత్రం వారసుడు జనవరి 12న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అదే రోజు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా తెలుగులో వారసుడిగా తమిళంలో వారిసు గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇకపోతే తాజాగా వారసుడు సినిమా రన్ టైమ్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే పెద్ద మూవీగా ఇది నిలిచింది. ఏకంగా 2 గంటల 49 నిమిషాల నిడివితో వారసుడు ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రాబోతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.  వారసుడు ట్రైలర్ బుధవారం అనగా జనవరి 4 అంటే ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు రిలీజ్ కానుంది. సన్ టివి,  యూట్యూబ్ ఛానల్ లో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.  ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అనౌన్స్ చేయడం గమనార్హం.
ఇకపోతే ఈ సినిమా ద్వారా డైరెక్టర్ వంశీ పైడిపల్లి,  ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు.  బీస్ట్ సినిమా నిరాశపరిచిన తర్వాత వస్తున్న విజయ్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటిస్తోంది.  అలాగే ఇందులో ప్రకాష్ రాజ్ , ఖుష్బూ, జయసుధ ,శ్రీకాంత్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేటర్ల విషయంలో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ దిల్ రాజు మూవీ కావడంతో ఎక్కువ థియేటర్ లు ఈ సినిమాకి లభించాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: