అవతార్ 2: మరో రికార్డ్.. ఏకంగా ఆ లిస్టులోకి..?

Purushottham Vinay
గ్లోబల్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ తెరకెక్కించిన అవతార్-2 సినిమా కలెక్షన్లలో చాలా స్పీడ్ గా దూసుకెళ్తోంది. డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా .. ప్రపంచ వ్యాప్తంగా భారీగా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.అయితే 'అవతార్' సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అసలు అంతా ఇంతా కాదు. ఇప్పటికే రిలీజైన పార్ట్ వన్.. వరల్డ్ బాక్సాఫీస్ను షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అవ్వగా తాజాగా వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కూడా భారీ వసూళ్లలో దూసుకెళ్తోంది. అయితే తాజా లెక్కల ప్రకారం ఉత్తర అమెరికాలో ఈ సినిమా రూ.7,145 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా అయితే సుమారు రూ.11,600 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టిక్కెట్ అమ్ముడైన సినిమాల జాబితాలో 14వ స్థానానికి చేరింది అవతార్-2 సినిమా. "బ్లాక్ పాంథర్", "హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2" సినిమాలను "అవతార్ 2"సినిమా చాలా తక్కువ కాలంలోనే వెనక్కి నెట్టింది. 2022 వ సంవత్సరంలో విడుదలై అత్యధిక వసూళ్లను సాధించిన పారామౌంట్ ఇంకా టాప్ గన్:మావెరిక్ సినిమాలను బీట్ చేసేందుకు సిద్ధమైంది.


ఇండియాలో కూడా అవతార్ జోరు ఏమాత్రం తగ్గలేదు. డిసెంబర్ 16 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద 40.50 కోట్ల రూపాయలను రాబట్టింది. అయితే ప్రస్తుతం రూ.53.10 కోట్లు రాబట్టిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (2019) ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది. దీంతో ఇండియన్ మార్కెట్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అవతార్ 2 సినిమా రెండోస్థానంలో నిలిచింది. సోమవారం నాడు సుమారు రూ.7 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం వసూళ్లు రూ.350 కోట్ల దాకా చేరాయి. విడుదల అయిన 18 రోజుల తర్వాత కూడా ఇంత మొత్తంలో వసూళ్లు రాబట్టడం సూపర్ రికార్డేనని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే ఈ వసూళ్లు ఇలాగే కొనసాగితే.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా టోటల్ ఇండియన్ కలెక్షన్ అయిన రూ.రూ.367 కోట్ల మార్క్ను అవతార్-2 సినిమా ఈజీగా దాటేయగలదని మార్కెట్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: