సమంత నోటి వెంట అలాంటి మాటలా.. !?

Anilkumar
చాలా కాలం తర్వాత సమంత న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే చాలామంది తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది సమంత.అయితే ఇందులో భాగంగానే ఒక అభిమాని.. మీరు మంచి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మళ్లీ సందడి చేయాలి.. మీపై ఉన్న అన్ని విమర్శలు పోవాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని సమంతకు ఒక సందేశం పెట్టాడు. తన అభిమాని ఇక తన అభిమాని పెట్టిన ఆ సందేశానికి స్పందించింది సమంత మీ ఆశీస్సులకు ధన్యవాదాలు అని.. 

నాపై విమర్శల అసలు ఏం విమర్శలు నాపై వస్తున్నాయి.. అంటూ ప్రశ్నించింది సమంత. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి సక్సెస్ ను అందుకున్న ఈమె గత రెండేళ్లుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. తన భర్త నాగచైతన్యతో విభేదాలు అనంతరం విడాకులు తీసుకున్న ఈమె ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారికంగా ప్రకటించింది.చాలా పరిణామాలను ఎదుర్కొంది సమంత.అంతేకాదు దీనికిగాను చాలా ట్రబుల్స్ కి కూడా గురైంది. సమంతకి పిల్లల్ని కనడం ఇష్టం లేదని ఎవరితోనో ఎఫైర్ పెట్టుకొని అని దాని కారణంగానే..

నాగచైతన్య తో విడాకులు తీసుకుంది అన్న వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా అప్పుడు రావడం జరిగింది. అయితే తాజాగా మయోసైటీస్ అనే వ్యాధికి గురైన సమంత ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్సను కూడా తీసుకుంటుంది. ఆ చికిత్సకుగాను విదేశాలకు తిరుగుతోంది సమంత. ఆమె నటించిన యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తను ఈ వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయింది సమంత. మరోవైపు సమంత త్వరలోనే 'శకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: