సాయి పల్లవి నిజంగానే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందా..?

shami
ప్రేమం సినిమాతో ఆడియన్స్ ని అలరించి ఫిదాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి మొదటి సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. గ్లామర్ షో చేయకుండా తన అభినయంతో మెప్పిస్తూ వస్తున్న సాయి పల్లవిని మన వాళ్లు లేడీ సూపర్ స్టార్ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేశారు. లాస్ట్ ఇయర్ విరాటపర్వం సినిమాతో వచ్చిన సాయి పల్లవి గార్గి అనే సినిమా కూడా చేసింది.
ఇక ఏ సినిమా పడితే ఆ సినిమ చేయని సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించాలని అనుకుంటున్న సాయి పల్లవి కెరీర్ కి కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు సారీ అని చెబుతుందట.
అంతేకాదు అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్ర అనేసరికి ఒకే రకమైన కథలతో వస్తున్నారట. అది కూడా సాయి పల్లవికి ఇబ్బందిగా అనిపించిందని అంటున్నారు. తన నెక్స్ట్ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సాయి పల్లవి మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాకు సైన్ చేయలేదు. కెరీర్ కి కొంత గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయిన అమ్మడు ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. మరి సాయి పల్లవిని మెప్పించే కథ ఎవరు తీసుకెళ్తారు. ఆమె నెక్స్ట్ సినిమా ఏంటన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. సాయి పల్లవి మాత్రం తనకు నచ్చిన కథ వచ్చే దాకా సినిమా చేయకూదదని ఫిక్స్ అయిందట. సాయి పల్లవి కాదన్న పాత్రలు వేరే హీరోయిన్స్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. స్టార్ సినిమా అయినా కూడా కథలో తన పాత్ర వెయిట్ ని బట్టే సినిమా ఓకే చేస్తుంది సాయి పల్లవి అందుకే ఆమె సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: