ఫ్రాంచైజ్ భయాల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్..!

shami
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా కథ గ్లోబ్ త్రోటింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తారని లేటెస్ట్ టాక్. దానిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఫ్రాంచైజ్ గా అంటే సినిమాకు ఎక్కువ రోజులు పనిచేయాల్సి ఉంటుంది.
అంతేకాదు మహేష్ తో అలాంటి మూవీ అంటే మరింత టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. జక్కన్న మాత్రం ఈ సినిమాను ఫ్రాంచైజ్ గా కొనసాగించాలని ఫిక్స్ అయ్యారట. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ తో తీసే సినిమా ఒకటి రెండు పార్టులుగా చేస్తే చాలు కానీ ఇలా ఫ్రాంచైజ్ గా నాలుగు ఐదు భాగాలుగా అంటే కష్టమని అంటున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఎలా లేదన్నా ఈ ఏడాది చివరి వరకు పట్టేలా ఉంది. సో ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు.
రాజమౌళి మహేష్ తో సినిమా కోసం చాలా పెద్ద ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్రాంచైజి గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుండగా అన్నిట్లో మహేష్ హీరోగా ఉంటాడా లేక మరో హీరోని తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ మాత్రం రాజమౌళి సినిమా కోసం చాలీ ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాడు. మహేష్ రాజమౌళి ఈ కాంబో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేస్తారని చెప్పొచ్చు. మహేష్ కి ఆల్రెడీ నేషనల్ వైడ్ గా ఒక బ్రాండ్ క్రియేట్ అవగా రాజమౌళి సినిమాతో తన రేంజ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాని కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ మూవీ ఉంటుందని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: