మహేష్... త్రివిక్రమ్ మూవీ కోసం రెండు భారీ సెట్లు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా అతడు మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా మహేష్ కు త్రివిక్రమ్ కు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఖలేజా మూవీ తెరకెక్కింది. అనుష్క ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ... ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ రెండు మూవీ లు కూడా మంచి ప్రజాదరణ పొందాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ... ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి కాగా ... మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం ప్రస్తుతం రెండు భారీ సెట్ లను ఈ మూవీ యూనిట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఇంటర్ సెట్. ఒక సెట్ ను సారథి స్టూడియోలో నిర్మిస్తూ ఉండగా ... మరొక సెట్ ను సిటీ అవుట్ కట్స్ లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: