మళ్లీ వాయిదా పడ్డ వారసుడు ట్రైలర్..!

Divya
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం వారసుడు ఈ సినిమా కథను మొదటగా మహేష్ బాబుకు వినిపించగా.. ఆయన సినిమా డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరొకవైపు అల్లు అర్జున్ ని సంప్రదించగా ఆయన కూడా పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను సంప్రదించడం జరిగింది. అయితే ఆయనకు సినిమా కథ నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ వారసుడు సినిమాను తమిళ్లో కూడా వారిసు పేరిట రిలీజ్ చేయబోతున్నారు.
జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను  విడుదల చేస్తాము అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జనవరి ఒకటవ తేదీన సినిమా ట్రైలర్ ను  విడుదల చేస్తామని మొన్న వెల్లడించారు.. కానీ ఇప్పుడు ట్రైలర్ విడుదల ఆలస్యమైంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ట్రైలర్ రేపు అనగా జనవరి 4వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  అంతేకాదు ఈరోజు ఈ ట్రైలర్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీలో దిల్ రాజు మేనియా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఎందుకంటే రెండు తెలుగు సినిమాలను కాదని వారసుడు సినిమా కోసం భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంపై ఆయన ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాకు ఎక్కువ థియేటర్లు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్లో విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: