అజిత్ "తెగింపు" ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ తాజాగా తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... బోనీ కపూర్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని తమిళ్ లో తునివు పేరుతో విడుదల చేయనుండగా ... తెలుగులో తెగింపు పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే తునివు మూవీ యొక్క తమిళ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ తమిళ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ తెగింపు ట్రైలర్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ కు యూట్యూబ్ లో 351 మిలియన్ వ్యూస్ , 59 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే అజిత్ ఆఖరిగా వలిమై మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. మరి తెగింపు మూవీ తో అజిత్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: