అవతార్ 2 : ఇండియాలో ఇంకా అన్ని కోట్లు రాబట్టాలా..?

Divya
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009 లో అవతార్ సినిమా సీక్వెల్ గా వచ్చిన అవతార్ 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అవతార్ ది వే అఫ్ వాటర్ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజే ఇండియాలో రూ.38 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు 16 రోజులకు గాను మొత్తం రూ.350 కోట్ల రూపాయల కలెక్షన్ వసూలు చేసింది. ఇదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 16 రోజులకు గాను రూ.10,296.56 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఇకపోతే వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా సుమారుగా 400 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ విజువల్ వండర్ గా తెరకేక్కిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా థియేటర్లలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.  ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 180 పైగా భాషలలో విడుదలైన ఈ చిత్రం ప్రతిభాషలో కూడా భారీ వసూళ్లను రాబడుతూ.. మరింత క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.  ఇకపోతే ఇప్పటివరకు ఇండియాలో విడుదలయ్యి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిన హాలీవుడ్ సినిమాలను మించి ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ రాబడుతుందని చెప్పవచ్చు.
ఇకపోతే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఇంకా రూ.40 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.  ప్రస్తుతం సంక్రాంతి వరకు ఎలాగో సినిమాలేవి విడుదల కానందున ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఇంకో 40 కోట్ల రూపాయలు రాబడితే ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒకటి,  రెండు రోజుల్లోనే ఈ లిమిట్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని.. విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: