"శాకుంతల" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం లో రూపొందిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.

సమంత కొంతకాలం క్రితం పుష్ప ది రైస్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ ఐటమ్ సాంగ్ ద్వారా సమంత కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. తాజాగా సమంత "యశోద" మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా సమంత శాకుంతలం మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో దేవ్ మోహన్ , మోహన్ బాబు ఇతర ముఖ్య పాత్రలలో నటించగా ... గుణశేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: