జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 31 మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో దాదాపు 9 భాషలలో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ హీరోగా నటించడం ... కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే సినీ ప్రేమికుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించబోతున్నాడు.

ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీగా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ... జూనియర్ ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందే మూవీ లో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: