రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉంది... మాజీ విశ్వసుందరి..!

Pulgam Srinivas
మాజీ విశ్వ సుందరి అయినటువంటి మనుషి చిల్లర్ ఈ సంవత్సరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ హీరో గా తెరకెక్కిన పృథ్వీరాజ్ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ మనిషి కి మాత్రం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

పృధ్వీరాజ్ సినిమా హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల కావడంతో ... మనుషి కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మాజీ విశ్వ సుందరి అయినటువంటి మనిషి తాజాగా తన మనసులో మాట బయట పెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి తో పని చేయాలని ఉంది అని చెప్పుకొచ్చింది. రాజమౌళి గారి దర్శకత్వం చాలా బాగుంటుంది అని ఈ ముద్దుగుమ్మ ప్రశంసల వర్షం కురిపించింది.

అలాగే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తనకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చింది. అది మాత్రమే కాకుండా సమయం ఉన్నప్పుడల్లా రాజమౌళి దర్శకత్వం వహించిన మూవీ లు చూస్తాను అని కూడా తెలియజేసింది. ఇలా మాజీ విశ్వ సుందరి ... బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర్ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి జాన్ అబ్రహం తో కలిసి టేహ్రామ్ అనే మూవీ లో నటిస్తుంది. మనిషి కి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న సినిమా ఆఫర్ లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: