బాలకృష్ణ- శ్రుతి హాసన్‌ మాస్ మొగుడు సాంగ్ వచ్చేది అప్పుడే..

Satvika
నందమూరి హీరో బాలయ్య ఇప్పుడు యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినెని డైరెక్షన్ లో వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. షూటింగ్ పనులు, అన్నీ కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుక గా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉండగా..ఈ నెల 6న ఒంగోలు లో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ చిత్రంలోని నాల్గవ పాట- మాస్ మొగుడు లిరికల్ వీడియో జనవరి 3వ తేదీ సాయంత్రం 7:55 గంటలకు విడుదల కానుంది.

ఆ పాటలో బాలకృష్ణ, శ్రుతి హాసన్ ల రాకింగ్ కెమిస్ట్రీని చూపించే పోస్టర్ ద్వారా సాంగ్ డేట్ ని ప్రకటించారు. బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్ లో రాయల్ గా కనిపించగా, శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ గా కనిపిస్తోంది. మాస్ మొగుడు థమన్ మార్క్ మాస్ నంబర్‌ గా ఉండబోతోంది. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు కూడా భారీ హిట్ ను అందుకున్నాయి.. అంతేకాదు సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి..

ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ టోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాని కి రామ్-లక్ష్మణ్, వెంకట్ ఫైట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు..మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: