ఈ సంక్రాంతి ఆ ముద్దుగుమ్మదే..?

Pulgam Srinivas
ఈసారి సంక్రాంతికి అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తెలుగు సినీ ప్రేమికులు రెండు మూవీ ల పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులో ఒకటి నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ కాగా ... మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు విరయ్య. వీర సింహా రెడ్డి మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తేరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ ని కూడా మైత్రి సంస్థ వారు నిర్మించారు.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం విశేషం ... అలాగే ఈ రెండు మూవీ లపై భారీ అంచనాలు ప్రేక్షకులు నెలకొని ఉండడం మరో విశేషం. ఇలా ఈ సంక్రాంతి కి విడుదల కాబోయే భారీ క్రేజ్ ఉన్న రెండు తెలుగు మూవీ లలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దానితో ఈ సారి సంక్రాంతి కి అలరించబోయే ముద్దుగుమ్మలలో శృతి హాసన్ టాప్ స్థానంలో నిలిచింది. ఒక వేళ ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సాధించినట్లు అయితే శృతి హాసన్ క్రేజ్ అమాంతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెరిగిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: