"వాల్తేరు వీరయ్య" ఇంటర్వెల్ సీన్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్..!

Pulgam Srinivas
మరి కొన్ని రోజుల్లో విడుదలకు రెడీగా ఉన్నా మోస్ట్ అవైటెడ్ తెలుగు మూవీ లలో ఒకటి అయినటువంటి వాల్తేరు వీరయ్య మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... బాబీ సింహ ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ లు అయినటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్ లు కొరియోగ్రఫీ చేశారు.

తాజాగా ఈ మూవీ లోని ఇంటర్వెల్ యాక్షన్స్ సన్ని వేషాలకు సంబంధించిన కొన్ని అదిరిపోయే విషయాలను ఈ ఇద్దరు మాస్టర్ లు చెప్పుకొచ్చారు. వాల్తేరు వీరయ్య మూవీ లోని ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి గారు ఇంటర్వెల్ లో సడన్ గ రెండు గన్స్ పట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తారు అని రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఏ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: