అనుపమ క్రేజ్ ఇప్పట్లో తగ్గేటట్లులేదుగా..!

Divya
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందం, అభినయం, నటనా ప్రతిభ అన్ని ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక ఇన్ని రోజులు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు ఈమె కాలం మొదలైందని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ విజయం మీద విజయాన్ని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశానికి అతి చేరువలో ఉంది. ఈ క్రమంలోని మొన్నటి వరకు నిఖిల్ సిద్ధార్థ తో కలిసి కార్తికేయ 2 సినిమాను తెరకెక్కించగా ఈ సినిమాలో నిఖిల్ సరసన జోడిగా నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఇదే జోష్ మీద మళ్లీ 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమ. ఈ సినిమాలో కూడా నిఖిల్ హీరోగా నటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  అలా ఈ రెండు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన అనుపమ ఇప్పుడు మరొకసారి సీతాకోకచిలుక సినిమాతో కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించిన తొలి చిత్రం థ్రిల్లర్ వేషధారణలో భయంకరమైన అనుభూతిని కలిగించే ఈ చిత్రంలో అనుపమ లీడ్ రోల్ పోషించింది. ప్రపంచంలో ఒక స్త్రీ ఒంటరి పోరాటం గురించి మనం నమ్మాలని.. ఇద్దరు సోదరీమణుల ప్రయాణం అలాగే గీత తన సోదరి పుస్తకం నుండి ఒక ఆకును పట్టుకొని ఆమెలో ఎలా బలాన్ని పొందుతుంది అనేదాని గురించి ఈ సినిమా కథ.
ధైర్యంగా ఎదుర్కొని దృఢమైన మహిళలుగా అనుపమ తో పాటు ఇంకొక హీరోయిన్ కూడా పరిచయం చేయబడింది. ఈ సినిమాకు తమిళనాడులో భారీ రెస్పాన్స్ లభిస్తోందని చెప్పాలి.  ముఖ్యంగా ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.  దీంతో అనుపమ క్రేజ్ పూర్తిస్థాయిలో మరింత పెరిగిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: