వామ్మో.. జబర్దస్త్ షో కి ఇంద్రజ,ఖుష్బు అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..!?

Anilkumar
ఎన్నో ఏళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకప్పుడు సినిమాలలో నటించే వారి కంటే బుల్లితెరపై కనిపించే వారి కి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఇచ్చేవారు. అందుకే చాలామంది బుల్లితెరపై కనిపించేందుకు పెద్దగా ఇష్టపడరు. అప్పట్లో బుల్లితెర అంటే పెద్దగా క్రేజ్ ఉండేది కాదు .కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. సినిమాల్లో కంటే బుల్లితెరపైనే నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోలైన అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున మొదలుకొని చాలామంది బుల్లితెరపై హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. 

అంతేకాదు దాంతోపాటు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో కూడా జడ్జీలుగా గా వ్యవహరిస్తున్నారు. ఇక జబర్దస్త్ షో కి జడ్జి గా వ్యవహరిస్తున్న ఇంద్రజ మరియు కుష్బూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్. కానీ ఇప్పుడు మాత్రం జడ్జిలుగా మారారు. రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనంతరం ఇంద్రజ జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇంద్రజాతో పాటు కుష్బూ కూడా అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన రెమ్యునరేషన్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

అయితే వీరిద్దరి రెమ్యూనరేషన్  ఎంత అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరికి జబర్దస్త్ వారు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే అంటూ కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ కి జడ్జిగా వ్యవహరించిన రోజా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఆ స్థాయిలోనే వీరిద్దరికి కూడా ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజా కంటే ఎక్కువ స్థాయిలోనే జడ్జిగా అందరినీ మెప్పిస్తోంది ఇంద్రజ. కాబట్టి ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా తక్కువే అని చాలామంది భావిస్తున్నారు. ఇక కుష్బూ కూడా అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటుంది. కాబట్టి ఈమెకి కూడా భారీ స్థాయిలోనే రెమ్యూనిరేషన్ ని ఇస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: