పుష్ప సినిమాలో బన్నీకి యాస నేర్పింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్  గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.ఈయన సినిమా వస్తుంది అంటే అభిమానులు పండుగ చేసుకుంటారు. అయితే సాధారణంగా తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో , మాస్ క్యారెక్టర్ తో అందరిని అలరించాడు.

 ఇక ఈ సినిమాతోనే చరణ్ అనే నటుడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే ఈయన శ్రీకాళహస్తిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నెల్లూరు చిత్తూరు జిల్లాల వ్యాసపై ఈయనకి ఉన్న పట్టుతో పుష్ప సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఈయన. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం చరణ్ కి కూడా పలు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా లో నటిస్తున్న సమయంలోనే ఈయన ఒక ఇంటి వాడు కూడా అయ్యాడు. దీనికిగాను చాలా సందర్భాలలో పుష్ప సినిమా నాకు లైఫ్ తో పాటు వైఫ్ ని కూడా ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు .

అయితే ఈ చరణ్ ఎవరూ అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక ఈయన పూణేలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ సినిమాల్లో నటించాలని ఈయనకి ఉన్న కోరికతో హైదరాబాద్ రావడం జరిగింది. దాని అనంతరం సినిమాల కోసం చాలా ప్రయత్నించిన ఈయన చివరకు సొంత నాయుడుపేట మండలం కోడేరు వెళ్లి ఆటో నడుపుకున్నాడు. దాని అనంతరం మళ్లీ హైదరాబాద్ కి వచ్చి ఏకంగా పుష్పా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు ఈయన. ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న ఆడిషన్స్ సమయంలో చరణ్ చిత్తూరు యాసలో మాట్లాడడం.. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కి బాగా నచ్చింది. దీంతో ఈ సినిమాలో చరణ్ కు అవకాశాన్ని ఇచ్చాడు సుకుమార్. ఇక ఈ సినిమాలో చిత్తూరు యాసే ప్రధాన కారణం కావడంతో బన్నీకి ఈ సినిమాలో చిత్తూరు యాస నేర్పించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: