పుష్ప2 బడ్జెట్ ఎంతో తెలుసా?రిస్క్ చేస్తున్న సుక్కు..

Satvika
హీరో అల్లు అర్జున్ లైఫ్ లో పుష్ప ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గతేడాది డిసెంబర్‌ 17 న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా, చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్బంగా `అవతార్‌2` ప్రదర్శించే థియేటర్ల లో `పుష్ప2` వీడియో గ్లింప్స్ ని ప్రదర్శించారు. ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఎర్రచందనం స్మిగ్లింగ్‌ నేపథ్యం లో తెరకెక్కిన ఈ చిత్రం లో పుష్పరాజ్‌ గా బన్నీ నటించారు. శ్రీవల్లిగా బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు.. మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్నారు..

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా, మొదటి భాగంలో ని ఆర్టిస్టులు కొనసాగడంతో పాటు కొత్త ఆర్టిస్టులు కూడా రెండో భాగం లో కనిపిస్తారని సుక్కు అంటున్నారు.. మరోవైపు పార్ట్ లో సమంత తో `ఊ అంటావా మావ.. `అనే ఐటెమ్‌ సాంగ్ పెట్టగా, అది సంచలనం సృష్టించింది. రెండో భాగంలోనూ అలాంటి ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుందని, బాలీవుడ్‌ భామ తో చేయించాలనుకుంటున్న ట్టు తెలుస్తుంది.. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే..

 ఇకపోతే పుష్ప 2 చిత్ర బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సినిమా కు బడ్జెట్ 400 - 500 కోట్ల మధ్యలో అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పుష్ప బాలీవుడ్‌లో అంచనాలు లేకుండానే రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమాకి ఏ మాత్రం వెనకాడకుండా డబ్బులు ఖర్చు చేయనున్నట్టు టాక్.బన్నీకి పారితోషికం, లాభాలతో కలిపి ఏకంగా 130 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారనే టాక్.. అయితే బడ్జెట్ విషయంలో మాత్రం సుక్కు రిస్క్ చేస్తున్నారు.. చూడాలి మరి.. సినిమా పై ఆశలు పెట్టుకున్నారు టీమ్ ఎంత రాబడుతుందొ మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: