అలాంటి జీవితం గడుపుతానంటున్న అనసూయ...!!

murali krishna
వరుస వివాదాల తరువాత అనసూయలో కూడా మార్పులు వచ్చాయి. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ బాగా భిన్నంగా ఉంటున్నాయి. మై లైఫ్ మై రూల్స్ అంటూ వస్తుంది.
అస్సలు ఎవడేమంటే నాకేంటి? నాకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా అంటుంది. తన ట్రోలర్స్, హేటర్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఆమె పోస్ట్స్ అయితే ఉంటున్నాయి. మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా కానీ నాకు ఎలాంటి ఫరక్ పడదు అని నిరూపించాలి అని అనుకుంటుంది. అదే సమయంలో శృతి మించి కామెంట్స్ పెడితే వెంటనే యాక్షన్ షురూ చేస్తుందట..
ఆ మధ్య ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన యువకుడు అనసూయతో పాటు రష్మీ, ప్రగతి, శ్రీముఖి వంటి యాంకర్స్ ని ట్రోల్ చేస్తూ అసభ్యకర పోస్ట్స్ కూడా పెడుతున్నాడు. ఆధారాలతో సహా పట్టించింది. అనసూయ దెబ్బకు సదరు ట్రోలర్ కూడా కటకటాల పాలయ్యాడు. పలు సెక్షన్స్ క్రింద కేసులు కూడా నమోదు చేసి రిమాండ్ కి పంపారు. బుల్లితెర షోలు కూడా వదిలేసిన అనసూయ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యారు. ఖాళీ సమయంలో ఇలాంటి ట్రోలర్స్ పని పడుతున్నారటా.
అనసూయ ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకుంటే జైలుపాలు కాక తప్పదు మరి.. ఇక రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తన మార్క్ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. ' టు డేస్ లో 2022 ముగియనుంది. మరి ప్రణాళికలు ఏమిటీ?. ఏముంది ఎప్పటి లాగే ఎలాంటి దాపరికాలు లేకుండా ట్రాన్స్పరెంట్ లైఫ్ ను అయితే గడుపుతాను. ఇదిగో ఈ ఫోటోల మాదిరి' అని కామెంట్ కూడా పెట్టింది. మేకప్ లెస్ ఫోటోలు కూడా షేర్ చేసిన అనసూయ… పారదర్శకమైన జీవితం గడుపుతాను అని అంటుంది.
నా జీవితంలో తెలియని కోణాలు అస్సలు ఏమీ ఉండవు. నేను కూడా అలానే ఉంటాను. వచ్చే ఏడాది కూడా నా లైఫ్ స్టైల్ చాలా పారదర్శకంగా ఉంటుంది, అంటూ పరోక్షంగా నే చెప్పారు. కాగా అనసూయ జబర్దస్త్ వదిలేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బుల్లితెరకు కూడా పూర్తిగా దూరమయ్యారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్స్ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. పుష్ప మూవీలో దాక్షాయణిగా అనసూయ నెగిటివ్ షేడ్స్ కలిగిన డీగ్లామర్ పాత్ర చేశారు. పుష్ప 2 కూడా తెరకెక్కుతుండగా అందులో అనసూయ నటిస్తున్నారు. అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయ కూడా ముఖ్య పాత్ర చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: