"పుష్ప 2" లో ఆ నటి ఐటెం సాంగ్ చేయనుందా..!

Pulgam Srinivas
పోయిన సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదల అయి ఇండియా వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీలలో ఒకటి అయినటువంటి పుష్ప ది రైజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో పహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా ... రావు రమేష్ ... సునీల్ ... అనసూయ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... సమంత ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఎలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే. పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీ పై దేశవ్యాప్తంగా సిరి ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే పుష్పా పార్ట్ 1 మూవీ లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కు ఏ రేంజ్ క్రేజీ లభించిందో మన అందరికీ తెలిసిందే. దానితో పుష్ప పార్ట్ 2 లో కూడా అంతకు మించిన రేంజ్ లో ఐటమ్ సాంగ్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప పార్ట్ 1 మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించిన అనసూయ  పుష్ప పార్ట్ 2 మూవీ లో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: